సిరిపూడి జనసైనికులపై వైసీపీ నాయకుల దాడి

రేపల్లె నియోజకవర్గం: నగరం మండల పరిధిలో ఉన్న సిరిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గల జనసైనికుడు ఉప్పలపాటి సాగర్ తండ్రి ఉప్పలపాటి జాన్ బాబుపై పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వ్యవహారంలో సిరిపూడి గ్రామ వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో జాన్ బాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నగరం మండల అధ్యక్షులు ఉదయ్ కృష్ణ హుటాహుటిన వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, దగ్గర ఉండి వైద్యం చేయించి వైసీపీ నాయకులపై పోలీస్ కేస్ పెట్టడం జరిగింది. ఉదయ్ కృష్ణతో పాటు రేపల్లె టౌన్ అధ్యక్షులు మహేష్, మలిశెట్టి సాయి, బత్తుల మల్లి ఉన్నారు.