జనసేన మద్దతు దారులను వెలివేయాలని వైసీపీ నాయకులు చెప్పటం దారుణం: గునుకుల కిషోర్

జనసేన మద్దతు దారులను వెలివేయాలని వైసీపీ నాయకులు చెప్పటం దారుణం అంటూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ ఘటన ను తీవ్రంగా ఖండించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఒక మూర్ఖుడు. ఇందుకూరు పేట తంగిరాల వారి కండ్రిగలో చిన్న వివాదానికి సంబంధించి ఒక వర్గం జనసేనకు మద్దతు దారులని వారిని వెలివేయల్సిందిగా చెప్పటం దారుణం. వైసీపీ నాయకుల స్టికర్ల తిరుగుడే చివరి మజిలీ. ప్రపంచం ఎటు వైపు వెళ్తుందా అనిపిస్తుంది ఇలాంటి వారిని చూస్తుంటే నియోజక వర్గంలో ఎన్నో సమస్యలు పెట్టుకుని, వాటిని పరిష్కరించకుండా, గ్రావెల్, ఇసుక అక్రమంగా తవ్వుకుంటూ అక్రమార్జన చేస్తున్న వీరికి ప్రజలు సరైన సమాధానం చెప్తారు. స్థానిక జనసేన నాయకులు గుడి హరి రెడ్డి మరియు ఇతర నాయకులు వారికి అండగా నిలిచారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.