సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు బద్వేల్ చేన్న కిష్టయ్యతో కలిసి గిరిజనులకి జరిగిన అన్యాయం మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి గ్రామాన్ని శాసించిన దోచుకున్న వైసిపి పందికొక్కులు లింగం గుంట పేద గిరిజనుల యొక్క భూములను సైతం వదలకుండా వాళ్లకి పట్టాలు ఇప్పిస్తామని నమ్మిచి వాళ్ళ పేరుతో పట్టాలు ఇప్పించి సర్వే నెంబర్ 24 20/1 నుండి 7 వరకు 6.21.సెంట్ భూమిని
- గుండుబోయిన కనకమ్మ వ్/ఒ వెంకటరమణయ్య.
- గుండుబోయిన ఆదిశేషయ్య స్/ఒ పోలయ్య.
- గుండుబోయిన లక్ష్మయ్య స్/ఒ శేషయ్య.
- పోలుగేటి వెంకటయ్య స్/ఒ వెంకయ్య.
- మానీకల చెల్లయ్య స్/ఒ రామయ్య.
- గుండుబోయిన చెన్నయ్య స్/ఒ చిన్నయ్య.
- గార్లపాటి వజ్రమ్మ వ్/ఒ శ్రీనయ్య.
ఈ ఏడుగురి దగ్గర ఉన్న పట్టాలను సర్వేపల్లిలోని ఆరు గుంట ప్రభాకర్ రెడ్డి అనే బుల్లి రెడ్డి ఇంటికి పిలిపించుకొని వాళ్ళ దగ్గర పట్టాలను తీసుకొని వాళ్ల చేత సంతకాలు వేలిముద్రలు వేయించుకొని ఈ భూములను విశ్వసముద్ర వాళ్ళకి ముట్టజెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కోట్ల రూపాయలని వీళ్లు అధికారం ఉంది కదా అని మింగేసింది వాస్తవం కాదా…? ఆనాటి వైసిపి శాసనసభ్యుడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండదండలు చూసుకుని ఈ సర్వేపల్లి గ్రామాన్ని శాసించిన బుల్లి రెడ్డి చిట్టి రెడ్డి గిరిజనులని మోసం చేశారు. ఫోర్జరీ సంతకాలు పెట్టించడంలో సిద్ధహస్తుడు కాకణి అయితే పేద గిరిజనులని రాత్రి 8 గంటలకి ఇంటికి పిలిపించుకొని నేరుగా సంతకాలు పెట్టించుకుని వాళ్ల పట్టా భూములని వాళ్లకు రావాల్సిన డబ్బుని లాక్కున్న వైనం ఈ సర్వేపల్లి వైసిపి నాయకులది. తప్పుచేసి కూడా నేడు ప్రగల్బాలు పలుకుతూ ఎంక్వయిరీ చేయమంటున్నారంటే మీరు ఎంత గుండెలు తీసిన బంటులో అర్థమవుతుంది త్వరలోనే మీరు చేసిన అవినీతి అక్రమాలకు సర్వేపల్లి కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా మిమ్మల్ని ఊచలు లెక్కపెట్టిచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఒప్పుకునే ప్రసక్తే లేదు గిరిజనులకి న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, తెలుగుదేశం పార్టీ నాయకులు బద్వేలు చేన్న కిష్టయ్య, కుంకాల సుమన్, సమాధి గోవిందు, చిట్టిబోయిన సాయి, డి.రాము, చెంగయ్య, చిరంజీవి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment