వైసీపీ విముక్త ఏపీ జనసేన లక్ష్యం: గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి: వైకాపా విముక్తా ఆంధ్ర ప్రదేశ్ గా చేయడమే జనసేన ఏకైక లక్ష్యమని ఆ పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి అన్నారు. శనివారం పట్టణంలోని సిటిఎం రోడ్ టిఎన్ నాగిరెడ్డి వీధిలో జనసేన పార్టీ కార్యకర్తలు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగకాపోగా ప్రభుత్వ వైఫల్యాలను గొంతు ఎత్తి ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేయడం, అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నాలుగేళ్లలో ఏమీ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో నీటి సమస్యను పరిష్కరించడం చేతకాదని హంద్రీ నీవా కాలువలో వచ్చే నీటిని పక్క నియోజకవర్గానికి తీసుకెళ్తుంటే ప్రశ్నించే ధైర్యం లేదని విమర్శలు గుప్పించారు. మదనపల్లిలో జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, జనార్దన్, కుమార్, రెడ్డమ్మ, నవాజ్, సత్య, అఖిల్, అక్షయ్, రోమేల్, ధనుష్ పాల్గొన్నారు.