జనసేన కార్యకర్తలపై వైసిపి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్ షేక్ దాడి

తిరుపతి, బుధవారం రాత్రి జనసేన కార్యకర్తలపై వైసిపి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్ షేక్ దాడి చేసాడు. జనవరిలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన కార్యకర్తలు రాజేష్ నాయక్, కోమల్ బాబు, శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.. అప్పటి నుంచి మీ అంతు చూస్తానంటూ.. ఇమ్రాన్ షేక్ వారి పై బెదిరింపు చర్యలకు పాల్పడుతూ వచ్చాడు.. తన వార్డులో జనసేన కార్యక్రమాలు చేయవద్దని అనేకసార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జనసేన కార్యకర్తలపై ఇమ్రాన్ షేక్ దాడికి పాల్పడ్డాడు. జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని ప్రతిఘటిస్తూ.. తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ స్థానిక ఎస్పీని కలసి, నిందితులపై కఠిన తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. కిరణ్ రాయల్ వెంట.. పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, లీగల్ సెల్ శ్యామల, కీర్తన, హేమ కుమార్, సుమన్ బాబు, మనస్వామి, మనోజ్, బాల, చరణ్, రుద్ర కిషోర్ కూడా ఉన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-24-at-2.26.21-PM.jpeg