రాజ్యాంగ హక్కులను కాలురాస్తున్న వైసీపీ: సోమరౌతా అనురాధ

వేమూరు నియోజకవర్గం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ప్రజా సంఘాలు, మానవతావాదులు అనేకమంది వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఆదివారం మండలంలోని జంపని గ్రామంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసి ఆధారాలతో జైలు శిక్ష అనుభవించిన జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ను కూడా ఏదో విధంగా జైలుకు పంపాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు బనాయించారన్నారు చంద్రబాబు నాయుడును నిర్బంధించి 30 రోజులవుతున్నా ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు చూడలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజల పక్షంగా పోరాటం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు జనసేన కూడా కలిసి రావటం ఎంతో ఆనందదాయకమన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతా అనురాధ మాట్లాడుతూ శాంతియుతంగా జరిగే నిరసన కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అణచివేస్తుందని ప్రజలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కూడా కాలురాస్తుందన్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని గద్ద దింపే వరకు టిడిపి, జనసేన ఐక్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు మై నేని మురళీకృష్ణ దండే సుబ్బారావు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ షేక్ హనీఫ్, వేల్పుల రవి, యోబు, కొడాలి వెంకట్రావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఊస రాజేష్, చావల సర్పంచ్ విష్ణు మూలకాల శ్రీనివాసరావు, లక్ష్మీ దుర్గ చందోలు పృధ్వీలత, వాక సుధా తదితరులు పాల్గొన్నారు.