వైసీపీ ప్రతిపక్ష పార్టీలను అణచివేసే ప్రక్రియను కొనసాగిస్తుంది

ఏలూరు నియోజకవర్గం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను అణచివేసే ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, శాసనసభ్యులు కొనసాగిస్తున్నారని జనసేన పార్టీ ఉభయ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ నాని నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడం లేదన్నారు.. గొళ్ళాయిగూడెం నుంచి వట్లూరు వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా చెరువులను తలపించేలా పెద్ద పెద్ద గోతులు ఉంటే వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కైకలూరు వెళ్లే రోడ్డులో తూర్పు వీధి సెంటర్లోని పిల్ హౌస్ పేట ఏరియాలో ఇటీవల కంటి తడుపుగా ప్యాచ్ వర్క్స్ చేశారని, మళ్లీ గోతులు మయం గా తయారయ్యిందన్నారు.. ఇందిరమ్మ కాలనీలను చూస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనీ, ఏ ఏరియాలో కూడా నడవడానికి అవకాశం లేదన్నారు.. శాసనసభ్యులు, మేయర్, మేయర్ భర్త, కార్పొరేటర్లు సమస్యలను గాలికి వదిలివేసి ఇతర పార్టీ వారు ఎక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏ సందులో క్యాలెండర్లు పెడుతున్నారు. వారి ఫోటోలు కనపడకూడదు, మా దరిద్రమైన ఫోటోలు మాత్రమే ఏలూరులో ప్రదర్శన ఇవ్వాలి, ఇతర పార్టీ వారు పెట్టిన ఫ్లెక్సీలు, క్యాలెండర్లు ఉండకూడదు వాటిని తీసి వేయండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చి తీసి వేయించారన్నారు.. ఏ డివిజన్లోనూ, ఏ మూల కూడా ఇతర పార్టీ వారి క్యాలెండర్ లు ఉండకుండా తీసివేయాలని ఎమ్మెల్యే, మేయర్ దురదృష్టకరమైన, కుట్రపూరితమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి అమలు చేయిస్తున్నారు.. ఏ మీ బాబు గారి సొంతమా ఏలూరు నగరం అని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు అన్ని నీవే ఉండాలా!, మీవి ఏరకంగా ఉంచుతారు?, మావి ఏరకంగా తీస్తారు అని ఎమ్మెల్యే, మేయర్ ను రెడ్డి అప్పలనాయుడు ప్రశ్నించారు. ఇదే వరవడి కొనసాగితే మీ ముఖాలు ఎక్కడా కనిపించవని హెచ్చరించారు.. ప్రశాంతంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో ఇలాంటి కుట్రపూరితమైన, ద్వేషంతో కలిగిన ఆలోచనలు మానుకోవాలని ఎమ్మెల్యే, మేయర్, మేయర్ భర్తకు, అధికారులకు ఆయన సూచించారు. ఫ్లెక్సీలు, క్యాలెండర్లు తీస్తే మొత్తం అందరివీ తీసివేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మినహా మరెవరివీ ఫోటోలు ఉండకూడదన్నారు. అలా కాకుండా వివక్షత చూపితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారు.. మీ అవినీతిపై రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టామని, అందరి బండారం బయటపెడతామన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ఏలూరు నగర కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, ప్రోగ్రాం కమిటీ సభ్యులు బొండా రాము నాయుడు, అధికార ప్రతి అల్లు సాయి చరణ్ తేజ్ పాల్గొన్నారు.