వైసీపీ ఆరోపణలు అవాస్తవం!

*సాక్ష్యాలతో చర్చకు సిద్ధం.. జనసేన రాజా రెడ్డి

తిరుపతి నగర పాలక సంస్థ నిధుల దుర్వినియోగంపై వైసీపీ నేతలు చేస్తున్న నిరాధారణ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ నేతలు, దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలంటూ సవాల్ విసిరారు. గురువారం జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిణి, లక్ష్మి, రాధ, కార్పొరేటర్ అనిల్ రాయల్, సుమన్ బాబు, మునస్వామి, వంశీ, వెంకటేష్, జిన్నా భాషాల సమక్షంలో పార్టీ నగర అధ్యక్షుడు రాజా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం కాలంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు దోచుకున్న ఘోర చరిత్ర గుర్తు చేస్తూ, కపిల్ తీర్థం దగ్గరున్న స్థలాన్ని వైసీపీ నేతలకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఖాళీగా ఉన్న నగరపాలక సంస్థ స్థలాలను విక్రయించాలన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై కౌన్సిల్‌లో చర్చించి అభిప్రాయాలు మాత్రమే సేకరించామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ, టీటీడీ నిధుల దోపిడీకి భూమన కుటుంబమే బాధ్యమని పేర్కొన్న రాజా రెడ్డి, “వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అవినీతిపై త్వరలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతి మీద మాట్లాడే అర్హత వైసీపీకి లేదు” అన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పనిచేస్తోందని, చంద్రబాబు – పవన్ కల్యాణ్ నేతృత్వంలో అభివృద్ధికి నడుపుతున్నామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేసే ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలతో చర్చకు సిద్ధమని స్పష్టం చేస్తూ, “సవాల్ స్వీకరించి నిజాలను ఎదుర్కొనండి” అంటూ రాజా రెడ్డి హైడిమాండ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు తక్షణమే ఆపాలని, తిరుపతి ప్రజలు వైసీపీ అరాచకాలకు విసిగిపోయి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌ను 63,000 మెజారిటీతో గెలిపించారన్నది వాస్తవమని గుర్తుచేశారు.

Share this content:

Post Comment