జనసేన నాయకుడు డా. రవి కుమార్ మిడతాన
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఫీజు బకాయిలపై వైసీపీ చేస్తున్న ఆందోళన విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా. రవి కుమార్ మిడతాన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు, యువత గురించి పట్టించుకోని జగన్ రెడ్డి గారికి ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రూ. 4,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు మిగిల్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 800 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించామని తెలిపారు. విద్యార్థులు, టీచర్ల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఉద్యోగుల బకాయిలను ప్రస్తుతం తీర్చుతున్నామని స్పష్టం చేశారు. “జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై పోరాడేందుకు ఇప్పుడు వారి పార్టీయే రోడ్డెక్కడం హాస్యాస్పదం. రాష్ట్రంలోని యువత అంతా ఈ డ్రామాను గమనిస్తున్నారు,” అని డా. రవి కుమార్ మిడతాన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాళిదాసు పార్రి, రామునాయుడు, ఆదినారాయణ, గుద్దల పైడిరాజు, కోసురు అప్పన్నదొర, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment