వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌కు చెక్ పెట్టాలి

*నాటి విధ్వంస పాల‌న‌కు- కూట‌మి ప్ర‌భుత్వ వికాసానికి తేడా ఇదే..
*కూట‌మి ప్ర‌భుత్వ మంచిని చాటి చెబుదాం..
*జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి


చిల‌క‌లూరిపేట‌, ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం చేసిన అభివృద్దిని, మంచిని చూసి ఓర్వ‌లేక త‌ప్పుడు ప్ర‌చారాల‌కు పాల్ప‌డుతుంద‌ని, దీన్ని ధీటుగా ఎదుర్కోవాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చెప్పారు. శనివారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ ఏడాది పాలనలో సాధించిన విజయాలు.. అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులు, భవిష్యత్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లుతుంటే, ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని, రీకాల్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో పేరిట ఐదు వారాలపాటు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం చేపడుతున్నార‌ని దీన్ని ధీటుగా ఎదుర్కొని వారికి బుద్ది చెప్పాల‌ని కోరారు. \
నాటి విధ్వంస పాల‌న‌కు- కూట‌మి ప్ర‌భుత్వ వికాసానికి తేడా ఇదే.. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో వైసీపీ అధినేత‌ జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నార‌ని బాలాజి చెప్పారు. ఐదేళ్లపాటు రాష్ట్ర విధ్వంసానికి పాల్పడిన జగన్‌.. రాష్ట్రాన్ని వికాశంవైపు నడిపిస్తోన్న కూటమిని నిలదీస్తాననడం హాస్యాస్పదమన్నారు. ఏపీని అన్ని రంగాలలో కటిక చీకట్లకు నెట్టిన చరిత్ర వైసీపీద‌ని. అయినా తానేదో రాష్ట్రం కోసం జీవితాన్ని ధారపోశాని, ప్ర‌జ‌ల ముందు నక్క వినయాలు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రజలకు మరోసారి మభ్యపెట్టాలని యత్నిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. తాము నాడు చేసిన ప్ర‌జ‌లు మ‌ర‌చి పోయి ఉంటార‌ని వైసీపీ నాయ‌కులు భ్ర‌మ‌ల్లో ఉన్నార‌ని తెలిపారు. నాడు విద్యుత్‌ ఛార్జీలతో నడ్డి విరిచి, నిత్యావసరాల ధరలు ఆకాశంలోవున్నా నిర్లక్ష్యం చూపార‌ని, చెత్త పన్నుతో వేధించార‌ని, ఆర్టీసీ ఛార్జీలను మూడుసార్లు పెంచి ప్రజలకు వాతలు పెట్టార‌ని గుర్తు చేశారు. ఏటా ఆస్తిపన్నులు పెంచార‌ని, ఉచిత ఇసుక విధానం ఎత్తివేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టార‌ని, మద్యం ధరల్ని ఆకాశానికి చేర్చి, నాసిరకం మధ్యంతో ప్రజలు ప్రాణాలు తీశారని, ఇన్ని చేసిన జగన్‌.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఇవ‌న్ని మ‌రిచి పోయి ఉంటార‌ని ఇంటింటికెళ్లి తాను చేసిన మేలు చెప్పాల‌ని పిలుపు నివ్వ‌డం అవివేక‌మ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వ మంచిని చెబుదాం.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని బాలాజి తెలిపారు. పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం అమలు చేశారన్నారు.. అన్నదాతా సుఖీభవ ప్రణాళిక సిద్ధం చేశారని, . దీపం-2 కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, మైదాన, గిరిజన ప్రాంతాల్లో బీటీ, సీసీ రహదారులు, గోశాలల నిర్మాణం, గిరిశిఖర గ్రామాల్లో కంటైనర్‌ ఆసుపత్రుల ఏర్పాటువంటి విషయాలన్నింటినీ కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉందని వెల్లడించారు. పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లోనూ నిర్దుష్ట లక్ష్యాలు నిర్దేశించుకొని.. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేస్తోంది కూటమి ప్ర‌భుత్వం. అలాంటి కూటమిపై బురదచల్ల‌టానికి ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వస్తున్న వైసీపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని, కూట‌మి ప్ర‌భుత్వ మంచిని నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని పిలుపు నిచ్చారు.

Share this content:

Post Comment