విశాఖపట్నం ఎం.వి.పి దగ్గర వున్న జివిఎంసి స్పోర్ట్స్ అరీనా వద్ద యోగాంధ్ర-2025 కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మరియు కార్పొరేటర్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ఈ మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ఆరోగ్యానికి, మానసిక శాంతికి యోగాసనాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. యోగా అనేది ప్రాచీన భారతీయ సంపదగా, మన శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతను తీసుకొచ్చే మార్గం. కార్మికులు ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది. జూన్ 21న విశాఖపట్నంలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి గౌరవ ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొంటారు కావున అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అందరూ కలసి విజయవంతం చేయాలని కోరుతున్నానని తెలిపారు.
Share this content:
Post Comment