యోగా అవగాహనతో ఆరోగ్యపథం

*ఐ పంగిడిలో యోగా క్లాసులు

కొవ్వూరు నియోజకవర్గంలోని ఐ పంగిడి గ్రామంలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పంచాయతీ కార్యదర్శి ముత్యం ఆధ్వర్యంలో గ్రామంలో 9 ప్రదేశాల్లో యోగా క్లాసులు నిర్వహించారు. చిన్నから పెద్దవరకూ అందరికీ యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు యోగా యొక్క అవసరాన్ని గుర్తు చేస్తూ ఊరంతా ర్యాలీగా నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో యోగాసనాలు చేయించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యం రేపారు. ఈ కార్యక్రమంలో రంగారావు, సర్పంచ్ నాగార్జున, బీజేపీ పోతురాజు, జనసేన నాయకులు కొప్పాక విజయ్ కుమార్, వాసిరెడ్డి వేంకటేష్, పెరుగు శివ, పూటి జగదీష్, మడిచర్ల నాగరాజు తదితర కూటమి నాయకులు, మహిళలు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. జూన్ 21న గ్రామంలో 500 మందికి పైగా పాల్గొనేలా యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సైతం ప్రకటించారు.

Share this content:

Post Comment