కొవ్వూరు నియోజకవర్గం ఐ.పంగిడి హైస్కూల్ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలను చూపించి, వాటి వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. భారతదేశంలో జన్మించిన యోగ అనే ప్రాచీన విద్యను ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోడీ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో “యోగాంధ్రా”గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలో చైర్మన్ కారింకి వెంకటలక్ష్మీ, వైస్ చైర్మన్ పెరుగు శివ, పెరెంట్స్ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Share this content:
Post Comment