*జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహణ
సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యవేక్షణలో, మండల సీనియర్ నాయకుడు రహీం ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి మాట్లాడుతూ – యోగ అనేది పునీతమైన ప్రక్రియ అని, మహర్షులు దీనిద్వారా జ్ఞానం, ఆరోగ్యాన్ని పొందినట్లు చెప్పారు. నేటి యుగంలో యువత యోగాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని, ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడే రక్షణ కవచం వంటిదని తెలిపారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు యోగ కారణంగా చూసే స్థితికి రావడం గర్వకారణమని చెప్పారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి విశాఖపట్నం పర్యటనను రాష్ట్రానికి అదృష్టంగా పేర్కొంటూ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, బోల అశోక్, కావలి మస్తాన్, ఎలికం గిరీష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment