డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జూన్ 21న శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే థీమ్‌తో విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ విద్యార్థులతో కలిసి యోగా సాధన చేస్తూ, యోగా శారీరక, మానసిక శాంతికి మార్గమని సూచించారు. యువత ఆరోగ్యంగా ఎదగాలంటే యోగా తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇక విశాఖపట్నంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రధాన యోగా ఉత్సవానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరై యోగా యొక్క ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటించారు. ఈ తరహా కార్యక్రమాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది వేస్తాయని పాఠశాల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
Share this content:
Post Comment