నందిగామలో యోగా దినోత్సవ వేడుకలు

నందిగామ పట్టణ జెడ్పిహెచ్ స్కూల్ ఆవరణలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణ కుమారి నేతృత్వం వహించారు. మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చందర్లపాడు మండల జనసేన అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్, బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, జనసేన నాయకుడు కొట్టె బద్రి పాల్గొన్నారు. ఆర్డీవో బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, యోగ గురువులు, విద్యార్థులు, పోలీస్, రెవిన్యూ తదితర శాఖల అధికారులు యోగా ఆసనాల్లో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు.

image-18-1024x682 నందిగామలో యోగా దినోత్సవ వేడుకలు

Share this content:

Post Comment