భవానిపురంలో ఘనంగా యోగా దినోత్సవం

విజయవాడలోని భవానిపురం అన్నా క్యాంటీన్ ఎదుట 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో 500 మందితో అద్భుత యోగా ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేసీ హైస్కూల్ విద్యార్థులు వినూత్న యోగాసనాలతో ఆకట్టుకోగా, యోగ గురువు డాక్టర్ వెంకటేశ్వర గురూజీ పర్యవేక్షణలో, భవానిపురం వన్ శాఖ గురువు కళాధర్ యోగి, కన్వీనర్ జనార్ధన్ వితరణ యోగి సమన్వయంతో, అభిమన్యు యోగి జె. శ్రీను నేతృత్వంలో సమగ్రమైన ప్రదర్శనలు సాగాయి.
ప్రత్యేక అతిథులుగా హాజరైన జనసేన నాయకురాలు తిరుపతి అనూష, యోగా డాక్టరేట్ పొందిన డా. యుగంధర్, బీజేపీ అధ్యక్షుడు శ్రీరామ్ యోగా ప్రాధాన్యతను వివరిస్తూ విలువైన సందేశాలు అందించారు. “యోగం వల్ల శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. రోజూ అరగంటైనా యోగా చేయడం ఆరోగ్యానికి ఆయువు గాలిలాంటిది” అని వారు పేర్కొన్నారు. సత్యనారాయణపురం, సింగ్ నగర్, గొల్లపూడి, కొండపల్లి తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో యోగాభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఇచ్చిన యోగా సంపదను ప్రతిరోజూ జీవితంలో అమలు చేయాలనే సందేశంతో ఈ వేడుక ముగిసింది.

Share this content:

Post Comment