*రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
రాజోలు, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం డిగ్రీ కాలేజీ మరియు శివకోటి 18 ఎకరాల కాలనీ వద్ద ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ విద్యార్థులు, స్థానిక నాయకులతో కలిసి యోగా అభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యోగ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది” అన్నారు. యువతలో ఆరోగ్యపరమైన చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని స్పష్టంచేశారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని విద్యార్థులలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడిందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు.

Share this content:
Post Comment