ఆయురారోగ్యాలను పెంచేదే యోగా!

*ఏ.కే.యూలో ఘనంగా యోగాంద్ర కార్యక్రమం

వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి మందులతో అవసరం లేకుండా ఆయురారోగ్యములను, ఆయుష్షును పెంచేదే యోగా కార్యక్రమమని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో వి.సి ప్రొఫెసర్ మూర్తి,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, పతంజలి యోగా కేంద్రం నిర్వాహకులు డాక్టర్ రావిపాటి ప్రసాద రావు తదితరులు ముఖ్య అతిదులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ యోగాసనాలు నిర్వహించడం ద్వారా శారీరక ధృడత్వం పెరుగుతుందని తద్వారా మానసిన శక్తి, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు. యోగా, ప్రాణయామం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని వినడం ద్వారా మనస్సు ప్రశాంతతను పొందుతుందని, తద్వారా ఆయురారోగ్యములు పెంపొంది మనిషి సుఖ,శాంతులతో జీవించ వచ్చునని ఆయన సూచించారు. రిజిష్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం ద్వారా సమాజం తద్వారా ప్రపంచం యావత్తూ సుఖ, శాంతులతో ఉంటుందని ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఉదయాన్నే యోగాసానాలను చేపట్టాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిత్య సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి యోగా, ధ్యానం, ప్రణాయామం కార్యక్రమాలలో తప్పకుండా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. పతంజలి యోగా కేంద్రం నిర్వాహకులు డాక్టర్ రావిపాటి ప్రసాద రావు మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికీ యోగా ఎంతో అవసరమని పేర్కొంటూ, యోగా కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాజ మోహన్ రావు అధ్యక్షత వహించగా, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా డాక్టర్ భారతి దేవి, అసిస్టెంట్ నోడల్ అధికారిగా డాక్టర్ సయ్యద్ ఆశీఫుద్దీన్ లు వ్యవహారించారు. యోగా కార్యక్రమం అనంతరం పతంజలి యోగా కేంద్రం నిర్వాహకులు, ఒంగోలుకు చెందిన యోగా గురువు డాక్టర్ రావిపాటి ప్రసాద రావును ఆంధ్ర కేసరి వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు తదితరుల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. నిర్మలా మణి, సిడిసి డీన్ ప్రొఫెసర్ జి. సోమ శేఖర, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ డి.వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ బి. పద్మజ తోబాటు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పతంజలి యోగా కేంద్రం సభ్యులు వెంకట రావు, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-21-at-11.17.59-AM-1-1024x768 ఆయురారోగ్యాలను పెంచేదే యోగా!

Share this content:

Post Comment