శరీరాన్ని, మనసును ఏకం చేసే సాధనమే “యోగ”

*రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

రాజానగరం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర 2025” కార్యక్రమం రాజానగరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మాధవి ఫంక్షన్ హాల్‌ వద్ద ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ – శరీరాన్ని, మనస్సును ఏకం చేసే సాధనమే యోగ. “ఒకే భూమి.. ఒకటే ఆరోగ్యం కోసం యోగ” అనే థీమ్‌తో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. విశ్వమంతా ఆరోగ్యంతో, శాంతితో ముందుకు సాగాలన్నదే ఈ దినోత్సవం సందేశమని తెలిపారు. విదేశీయులు యోగానికి గౌరవం ఇస్తూ ముందుకు సాగుతున్న వేళ, మనం ఈ పుణ్యభూమిలో పుట్టినవారిగా యోగాన్ని మరింత గౌరవంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తుల వెంకటలక్ష్మి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-21-at-11.25.16-AM-1024x683 శరీరాన్ని, మనసును ఏకం చేసే సాధనమే "యోగ"

Share this content:

Post Comment