*యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వివేకానంద విద్య నికేతన్ స్కూల్ విద్యార్థుల ర్యాలీ
విజయవాడ, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడ భవానీపురంలో శ్రీ వివేకానంద విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి, అవగాహన పెంచే ఉద్దేశంతో చిత్రలేఖన పోటీలు నిర్వహించగా, విజేతలకు జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష బహుమతులు అందజేశారు. పాఠశాల నుండి శివాలయం సెంటర్ వరకూ నిర్వహించిన సందేశాత్మక ర్యాలీలో విద్యార్థులు యోగా ముఖచిత్రాలతో, నినాదాలతో పాల్గొని ఆరోగ్య ప్రాధాన్యతను ప్రజల్లో చాటి చెప్పారు. చిన్న వయస్సులోనే పిల్లల్లో యోగా పట్ల ఆసక్తి పెరగడం అభినందనీయం అని వ్యాఖ్యానించిన అనూష, యోగా శారీరక, మానసిక శాంతికి దోహదపడే భారతీయ సంపదగా పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
Share this content:
Post Comment