హిందూపురంలో యోగాంధ్ర-2025

*కార్యక్రమానికి విశేష స్పందన

యోగాంధ్ర-2025 మహోత్సవాల్లో భాగంగా హిందూపురం మండలం, గోళ్ళాపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సామూహిక యోగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్కూల్ స్టాఫ్ సభ్యులు, ట్రైనర్ సూర్య ఫౌండేషన్ వాలంటీర్ హరీష్ నేతృత్వంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కలిసి యోగాసనాలు వేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఒక గంటయినా యోగా చేయాలన్న సందేశాన్ని అందించినట్లు నేతలు పేర్కొన్నారు. నిత్యజీవితంలో వచ్చే ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఓ మార్గం అని, చిన్నచిన్న శ్వాస సంబంధిత సమస్యలు సైతం యోగాసనాల ద్వారా తగ్గుతాయని సూచించారు. ముఖ్యంగా యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment