యోగాంధ్ర విజయానికి సమాయత్తం

*కార్యకర్తలలో ఉత్సాహం నింపుతున్న కడ్రక మల్లేశ్వరరావు, జనసేన జానీ

జూన్ 21న జరగనున్న ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన్యం జిల్లా కూరుపాం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ నేతృత్వంలో బుధవారం కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జరగబోయే ఈ చారిత్రక కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే యోగా ఉద్యమాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నిమ్మక జయకృష్ణ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు నాయకులు, మండలాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యోగాంధ్రను విజయవంతం చేయడం మనందరి బాధ్యతగా జనసేన జానీ పేర్కొన్నారు.

Share this content:

Post Comment