11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం వండువా పంచాయతీలో నిర్వహించిన యోగా ఉత్సవం ఘనంగా సాగింది. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ పి. రాము మాట్లాడుతూ, యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అది మన శరీరం, మనస్సు, శ్వాస, ఆత్మను ఏకం చేసే భారతీయ సనాతన ధర్మం నుంచి వచ్చిన పర్వదిన సాధనగా పేర్కొన్నారు. నిత్యం యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, రోగాలు దరిచేరవని తెలిపారు. యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్ మీడితానా కళ్యాణి, కూటమి నాయకులు గొర్లె కోటీశ్వరరావు, జనసేన యువ నాయకులు రఘుమండల గణేష్, ఏఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఇతర అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్య భారత్ లక్ష్య సాధన సాధ్యమవుతుందని, ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జయకృష్ణలకు ప్రజలంతా కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment