కీర్తనను వక్రీకరించావు… క్షమాపణ చెప్పు..

  • అన్నమయ్య వంశీకుల విన్నపాన్ని వినవా.
  • తక్షణం పాటను డిలీట్ చెయ్.
  • శ్రావణ భార్గవిని హెచ్చరించిన తిరుపతి స్థానికులు.

తైరుపతి, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చేతిలోని (నందకం) భూలోకానికి వచ్చి అన్నమయ్యగా అవతరించారని, శ్రీవారి భక్తుడిగా వేల సంకీర్తనలు రాసి చరిత్రలో అన్నమయ్య నిలిచిపోయారని, అటువంటి అన్నమయ్య రాసిన కీర్తనను బ్రాహ్మణ కులంలో పుట్టిన సాయి భార్గవి అశ్లీల తతో కూడిన పాప్ సాంగులా పేరు తెచ్చుకోవడానికి వాడుకోవడాన్ని స్థానికులు ఆగ్రహంతో ఖండించారు. ప్రముఖ గాయని కీర్తిశేషులు (ఎమ్మెస్ సుబ్బలక్ష్మి) ప్రతిఫలం ఆశించకుండా శ్రీవారి సంకీర్తనలను ఆలపించి నేడు తిరుపతిలో ఆమె విగ్రహం ప్రతిష్టించేలా నడుచుకోవడం ఆదర్శదాయకం అన్నారు. శ్రావణ భార్గవి చేసిన ఈ శృంగార సాంగుపై అన్నమయ్య వంశీకులు ప్రశ్నించగా, దానిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. టిటిడి ఇకనైనా మేల్కొని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు, ఇప్పటికే ఈ అశ్లీల సాంగ్ కు 20 లక్షల లైకులు రావడం బాధాకరమన్నారు, సాయి భార్గవి వెంటనే ఈ పాటను డిలీట్ చేయాలని లేని పక్షంలో తిరుపతిలో ఆమెను బహిష్కరిస్తామని(అడుగుపెట్టనియమని) వారు హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో శ్రీవారి భక్తులు తిరుపతి స్థానికులు బత్తేన మధుబాబు, హిమవంత్, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, మునస్వామి, తోట జయంతి తదితరులు పాల్గొన్నారు.