జనసేన విద్యార్థి విభాగంలో చేరిన ఉప్పల్ నియోజకవర్గ యువ నాయకులు

హైదరాబాద్, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన విద్యార్థి విభాగం ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై ఉప్పల్ నియోజకవర్గ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు యువ నాయకులు, సింహాద్రి, చరణ్, సాయి, దాదాపు 60 మంది జనసేన విద్యార్థి విభాగంలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రెటరీ కత్తి సైదులు, గ్రేటర్ హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్ ఓయూ కమిటీ సభ్యులు రాజేష్, హనుమంతు, చిరంజీవులు, నిజాం కాలేజ్ విద్యార్థి నాయకులు మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.