గుంటూరు సిటీ, ప్రముఖ సినీనటులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆదివారం నాడు నగరంలోని పాతగుంటూరు, సుద్దల్లి డొంక నందు సుధీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, మెగా అభిమాన సంఘాల, జనసేన యువజన నాయకులు యర్రగోపుల జయదీప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పు వెంకట రత్తయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సేవాకార్యక్రమాలకు, రక్తదాన శిబిరాలను మెగా కుటుంబం ఒక దిక్సూచి అని యువత ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వెల్లడించారు. రామచరణ్ అభిమానులంతా కలసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన సుధీర్, శివకృష్ణలను ప్రత్యేకంగా అభినందించి అనంతరం సర్టిఫికేట్ లను అందజేశారు. యర్రగోపుల జయదీప్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ అవార్డుల స్ధాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులగా తామంతా గర్వపడుతున్నామని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉచిత వైద్య సేవలు, సేవాకార్యక్రమాలతో రామ్ చరణ్ తమకు ఎంతో ప్రేరణగా నిలిచారని కొనియాడారు. రక్తదానాలు వల్ల ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం తమకు భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో రామ్ చరణ్ మరింత ఉన్నతస్ధాయికి చేరుకోని భారతీయ సినిమా స్ధాయిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
Share this content:
Post Comment