యువశక్తికి యువత తరలి రండి

  • మన అధినాయకులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం
  • పవనన్నను సీఎం చేద్దామని పిలుపునిచ్చిన జనసేన పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్, చీపురుపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జి.

విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం ఎస్ ఎస్ ఆర్ పేట దత్తా ఎస్టేట్ లో యువశక్తి కార్యక్రమంను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు జనసేన సైనకులతో మాట్లాడుతూ అందరు కలిసి కట్టుగా ముందుకు సాగాలి. మన మధ్య విబేధాలు ఉండకూడదు. జనసేన పార్టీ బలోపేతం కావడానికి మనం అందరం కలిసి కట్టుగా కృషి చేయాలి. రాబోయే ఎన్నికలకు ముందు ఇదే భారీ బహిరంగ సభ కనుక జనసైనికులు శ్రమించాలి, కష్టపడాలి. కష్టే ఫలి అనే నినాదం మనది. మంచి ఆశయాలు సిద్ధాంతాలు కలిగిన పార్టీ మన జనసేన పార్టీ ఆదినాయకుడు పవన్ కళ్యాణ్ మాటను తుచా తప్పకుండ ప్రతీ ఒక్కరు పని చేయాలి. అప్పుడే మన నాయకుడు సీఎం అవుతారు. అని అయన జనసైనికులలో ఆత్మ విశ్వాసం నింపారు మన యువత మన భవిత అనే యువశక్తి. రణస్థలంలో జనవరి 12 వ తారీకు 2023. న జరగబోయే కార్యక్రమంను విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్య అతిధిగా జనసేన పిఏసి సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జి ముత్తా శశిధర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు గరివిడి మండలం జనసేన నాయకులు తుమ్మిగంటి సూరినాయుడు గుర్ల మండలం జనసేన పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్ వివిధ గ్రామాల జనసైనికులు యువకులు పాల్గొన్నారు.