భవిష్యత్ రాజకీయాల్లో యువత చురుకైన పాత్ర పోషించాలి: వంపురు గంగులయ్య

జి.మాడుగుల మండలం, బోయితేలి పంచాయితీ, పెదగరువు గ్రామ యువతతో జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య గ్రామస్థాయి పర్యటనలో భాగంగా పెదగరువు గ్రామయువతతో మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని, భవిష్యత్ తరాలకు కనువిప్పు కలిగించి భరోసానిచ్చే రాజకీయాలు కేవలం యువతతోనే సాధ్యమని.. నానాటికి తీవ్రమైన అస్థిరతకు గురౌతున్న ఆదివాసీ సామాజిక, ఆర్ధిక, రాజకీయ అధికారాలు విజ్ఞానవంతులైన యువత తమచేతుల్లోకి తీసుకోవాలని.. లేదంటే ఈ ప్రపంచంలో చూస్తుండగానే తమ మనుగడ, అస్తిత్వం కోల్పోయిన ఆదివాసీ తెగలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోతాయని.. ప్రస్తుతం పరిస్థితులు మరియు కుహనా రాజకీయ శక్తులు గిరిజనుల అభివృద్ధి పేరునా జరిపే విధ్వంసమే ఎక్కువ. మీరు ప్రతి రోజు చూస్తున్న, వింటున్న నిజాలే! ప్రతి ఒక గిరిజన యువతి, యువకులు చైతన్యవంతమైన రాజకీయాల్లోకి రావాలని.. మార్పుకోరకు శ్రమించే నాయకులని ఆదరించాలని హితవు పలికారు.