జనసేన పార్టీలో చేరిన కృష్ణాపురం యువత

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలం, వంజరి పంచాయితీ, కృష్ణాపురం గ్రామ యువత జనసేన పార్టీలో చేరారు. గ్రామ యువత పిలుపుమేరకు జనసేన పార్టీ నాయకులు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, ఉల్లి సీతారామ్, కిముడు కృష్ణమూర్తి తదితర నాయకులు కృష్ణాపురం చేరుకుని గ్రామయువతతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డా. వంపురు గంగులయ్య మాట్లాడుతూ ప్రస్తుతం గిరిజన యువత మార్పుకోరుకుంటున్నారు. రాజకీయాలతో గిరిజన అస్తిత్వం ముడిపడివుందనే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. చట్ట సభల్లో మాట్లాడలేని అసమర్ధుల చేతుల్లో మా భవిష్యత్ ని పెట్టలేమనే కఠోర నిజాన్ని తెలుసుకున్నారని మార్పుకోసం తమవంతు పాత్ర జనసేన పార్టీ ద్వారా నిర్వర్తించాలని అన్నారు. ఈ సందర్బంగా వైసీపీ పార్టీ గిరిజన వ్యతిరేక విధానాలు నచ్చక వార్డు మెంబర్ తమార్బ రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, పెట్టిన ముద్దుల ఫలితం తీరా గెలిచి అధికారం సాధించుకున్నాక ఏమి చేశారో ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. ఈ రోజు పంచాయితిరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ, చివరికి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా దారిమళ్లించి తమ సొంత ప్రయోజనాలకోసం పథకాల మాటున పార్టీని నడిపే నిష్ఠురపు పనులు చేస్తుంటే చూస్తూ కూర్చోవడం మా వల్ల కాదు అందుకే ప్రశ్నించి నిజాయితీగా సూటిగా అడిగే ఒకే ఒక్కపార్టీ ప్రజల తరపున నిలబడే సత్తా ఉన్న పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమేనని, అందుకే మా అనుచరులు, యువతతో గంగులయ్యగారి ద్వారా జనసేన పార్టీలో చేరుతున్నామన్నారు. పార్టీ గెలుపుకోసం మా శక్తివంచన లేకుండా కృషిచేస్తామని వార్డ్ మెంబర్ రమేష్ అతని అనుచరగణం తెలిపారు. అనంతరం వారికి వంపూరు గంగులయ్య జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, చింతపల్లి మండలఅధ్యక్షులు వంతల బుజ్జిబాబు, ఉల్లి సీతారామ్, కూడా అబ్బాయి దొర వార్డు మెంబర్, కిముడు కృష్ణమూర్తి, శ్రీను, ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.