పోటీ ప్రపంచంలో యువత ముందుండాలి: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, గౌతమి హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జర్గిన కార్యక్రమానికి జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గంగులయ్యకి విద్యార్ధిని విద్యార్దులు, పాఠశాల యాజమాన్యం పూలాభిషేకం చేస్తూ పూలబొకేలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతే యావత్ భారతదేశానికి పునాదులుగా నిలబడతారు అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలోని ఆణిముత్యాలని వెలికి తీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడమే కాక వ్యాయామం, క్రీడలు వల్ల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయన్నారు. విద్యార్థి విద్యార్దులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్న పాఠశాల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే విద్యార్ధిని విద్యార్దులకు జీవితాల్లో క్రీడలు అతి కీలకమైనదన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవని అలాగే ఈ క్రీడలు గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రతి పాఠశాలలో కొనసాగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే మా లక్ష్యంమని అన్నారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదల అని వివరించారు. ఉన్నతమైన విద్య అందించడమే నారా లోకేష్ లక్ష్యం అని అన్నారు. విజేతలుగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్దులకు మెడలో మెడల్ వేసి సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఓటమి గెలుపుకు నాంది అని అన్నారు. గెలిచిన విద్యార్దులు మరింత స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు విద్యార్దులు క్రీడల్లో చక్కగా రాణించాలని అందుకు పాఠశాల నిర్వాహకులు నిత్యం క్రీడలను నిర్వహించాలని సూచించారు. అనంతరం గంగులయ్య ఆధ్వర్యంలో క్రీడా పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమి హైస్కూల్ యాజమాన్యం ప్రతినిధులు, పాఠశాల టీచర్లు, క్రీడాకారులు, జనసేన పార్టీ ఐటీ టీమ్ కో-ఆర్డినేటర్ సీ.హెచ్ అనిల్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్, పాడేరు మండల నాయకులు కుంచే దేవేంద్ర ప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment