యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

*సమాజ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఇదే మార్గం

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపురం నియోజవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని పంజా సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మరియు ప్రభుత్వ సలహాదారులు మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఏ షరీఫ్ టిడిపి ఇన్చార్జ్ పోత్తూర రామరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం “ఈగల్” పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, గంజాయి నిర్మూలన కోసం చట్టపరంగా గట్టి చర్యలు చేపడుతోంది. మాదకద్రవ్యాల బారిన పడే విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా తల్లిదండ్రులు ప్రతిక్షణం జాగ్రత్తగా గమనించాలని, విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ముందుకెళ్లాలని కోరుతున్నాను. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ రోజు మనందరికీ హెచ్చరికతో పాటు, కొత్త నిబద్ధతకు గుర్తుగా నిలవాలి. ఈ కార్యక్రమంలో నియోజవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-26-at-8.23.57-PM-1-1024x682 యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Share this content:

Post Comment