* జనసేన నేత పెంటేల బాలాజి
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని, తగిన అవగాహనతోనే దీనిని నియంత్రించవచ్చని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి హెచ్చరించారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వలన యువత ఆర్థికంగా నష్టపోతుండటంతోపాటు, ఆత్మహత్యలకు కూడా దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ మోసాలు యువతను వలలో వేసుకుంటూ, మొదట స్వల్ప డబ్బులు గెలిపించి ఆ తర్వాత పెద్ద మొత్తాల్లో నష్టపోయేలా చేస్తాయని వివరించారు. సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తున్న ఈ బెట్టింగ్ యాప్‌లు యువతను మాయగజ్జిలో పడేస్తున్నాయని, వారి భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. పోలీసు శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించి నిఘా పెంచాలని, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు గురికాకుండా సమాజంలో చైతన్యవంతులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
Share this content:
Post Comment