భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి

  • గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ కు ఘన నివాళి

దేశ స్వతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహనీయులను యువత ఆదర్శంగా తీసుకుకోవాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర రావు కోరారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో దేశ స్వాతంత్ర్య కోసం అలుపెరుగని పోరాటం చేసి, చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన మహనీయులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో యువకులను సమీకరించి స్వాతంత్ర ఉద్యమంలో వీరోచితమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ ధావర్ ల ఆశయాలను, త్యాగాలను, పోరాటాలను స్మరించుకుంటూ నేటి యువత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి.ఓ.సి కె.మోహన్, కార్తీక్, సునీల్, రవి, మనోజ్, గురుబాబు, మహేష్, సాయి, సనత్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment