జనసేనలో యువత భారీగా చేరికలు

తిరుపతి సిటీ: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి స్థానిక తిరుపతి 1వ వార్డు అధ్యక్షుడు వంశీ, నగర ఉపాధ్యక్షురాలు మలిసెట్టి లక్ష్మి ఆధ్వర్యంలో తిమ్మినాయుడు పాళ్యం నుంచి సుమారు 100 మందికి పైగా యువతి, యువకులు ఆదివారం జనసేనలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి శుభాషిని, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్బరు చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేయిస్తానని, యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేశారు. ఈ ఈ సందర్భంన యువకులు నరేష్, ప్రసాద్, బాలాజీ, మదన్, మోహన్ మరియు ఇతర పార్టీల కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర, వార్డు కమిటీ సభ్యులు మరియు వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.