దుర్గమ్మను దర్శించుకోనున్న వైఎస్‌ జగన్

ప్రతీ ఏటా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులు బెజవాడ కనకదుర్గమ్మకు మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్‌ బయలు దేరతారు. నాలుగు గంటల కల్లా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పండితుల ఆశీర్వచనాలు తీసుకుని అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుంటారు.

ఈ సందర్భంగా మంగళవారం  ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ అక్కడి నుంచే ఫోన్లో ఏర్పాట్లను సమీక్షించారు.

దసరా ప్రారంభమై గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లను భక్తుల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. మంత్రితోపాటు ఈవో సురేష్‌ బాబు ఇతర అధికారులు ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు.

సీఎం రాక సందర్భంగా పోలీసు అధికారులు కాన్వాయ్ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కనకదుర్గమ్మ గుడిలో తాజా ఘటనల నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రాక సమయంలో ఆంక్షలు కూడా అమలు చేయబోతున్నారు.