బోడుప్పల్‌లో వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

వెఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుసుకొని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఆమె అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆమె మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత అనుమతి నిరాకరించినా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు అమెను అడ్డుకున్నారు.