వైసిపి నరికింది – జనసేన పాతింది

  • వినూత్నంగా మొక్కలు నాటిన జనసేన నాయకులు

అమలాపురం: జనసేన పార్టీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును సేవా వారోత్సవాలుగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలాపురం పర్యటనలో భాగంగా అత్యుత్సాహంతో వేలాది మొక్కలను నరకడం జరిగింది. ఈ యొక్క పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు అమలాపురం జనసేన పార్టీ పూనుకుంది. స్థానిక కాటన్ పార్కులో నరికిన మొక్కల స్థానే నీడనిచ్చే మొక్కలను నాటడం జరిగింది. అలానే వీటి పరిరక్షణను జనసేన పార్టీలో స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, సర్పంచులు, యం.పి.టి.సి.లు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది మా యొక్క పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని అందుకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు మేమంతా సిద్దమని డి.యం.ఆర్. తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, ఇసుకపట్ల జయమణి రఘు బాబు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్డీఎస్ ప్రసాద్, పోలిశెట్టి బాబులు, బట్టు పండు, భవాని శేఖర్, డి.యస్.యన్.కుమార్, తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, కంకిపాటి గోపి, కరిముల్ల బాబా, అల్లాడ రవి, గుండుమోగుల లక్ష్మి, గట్టెం వీరు, చిక్కం బాలాజీ, పోలిశెట్టి మహేష్, నల్లా బ్రహ్మాజీ మరియు జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.