ఏపీ ప్రజలకు వైసిపి ప్రభుత్వం కరెంట్ షాక్

  • భారీగా కరెంట్ బిల్లులు
  • కరెంట్ బిల్లు చూసి భయపడుతున్న జనం

పెడన నియోజకవర్గం: ఏపీ ప్రజలకు వైసిపి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చిందని పెడన నియోజకవర్గ, జనసేన నాయకులు ఎస్.వి. బాబు ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన కరెంటు బిల్లులు. సామాన్యుని నుండి సంపన్నుల వరకు కరెంటు బిల్లు చూసి హడలిపోతున్నారు. మండు వేసవికి భానుడి ప్రతాపంతో వడ దెబ్బ తింటున్న ఆంధ్ర ప్రజలకు జగన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే జగన్ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తుంది. చెత్త పన్ను, ఆస్తిపన్ను, మరుగుదొడ్ల పై పన్నులు వేస్తూ ఉక్కిరిబిక్కిరి వస్తుంది. పెంచిన విద్యుత్ బిల్లులు మరింత భారం కానుంది. గత నెలలో 200 రూపాయలు వచ్చిన కరెంటు వినియోదారుడికి ఈ నెల 600 రూపాయలు బిల్లు రావడంతొ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జగనన్న భారీ కరెంట్ బిల్లుల దోపిడీ పథకంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు పెరిగినప్పుడు బాదుడే… బాదుడు… బాదుడే… బాదుడు… అంటూ నానా యాగీ చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బాటలోనే అనేక రకాలుగా పన్నుల భారం మోపింది. గతంలో ట్రూఆఫ్ చార్జీలు పెంచినప్పుడు జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దాంతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చి ట్రూ ఆఫ్ చార్జీల పెంపును విరమించుకుంది. పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల జనసేన పార్టీ ప్రజా పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఎస్ వి బాబు తెలిపారు.