రాజానగరంలో జీరో అవుతున్న వైసిపి

  • కానవరం గ్రామ వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యర్రంశెట్టి శ్రీరామకృష్ణ గారు వైసీపీకి రాజీనామా.. “బత్తుల” సమక్షంలో జనసేన పార్టీలో చేరిక
  • బత్తుల దెబ్బ… రాజానగరంలో వైస్సార్సీపీ అబ్బా
  • వైస్సార్సీపీ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బత్తుల
  • కానవరం గ్రామంలో వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్న ముఖ్య నాయకులు
  • జనసేన పార్టీలో కొనసాగుతున్న భారీ చేరికలు.. అయోమయంలో వైసీపీ శ్రేణులు
  • గ్యాప్ లేకుండా వరుస జాయినింగ్స్ తో “జనసేన కంచుకోట”గా రాజానగరం నియోజకవర్గం
  • వైసీపీని వరసపెట్టి ఊర మాస్ గా చెడుగుడు ఆడుతున్న “బత్తుల”
  • పవనన్నపై నమ్మకం… “బలరామన్న”పై భరోసా… రాజానగరం నియోజకవర్గంలో భారీ మెజారిటీగా దిశగా జనసేన పార్టీ
  • రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి చూపు ఈసారి “గాజు గ్లాసు” పైనే
  • రాజానగరం నియోజకవర్గంలో వైసిపి అరాచక, అవినీతి, అసమర్థ పాలనపై విసుగుచెంది జనసేనలోకి క్యూ కడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీలో కథనోత్సవం….

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కానవరం గ్రామంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత, కానవరం గ్రామ వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యర్రంశెట్టి శ్రీరామకృష్ణ, ఇతర వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో, రాజానగరంలో వైసీపీ పాలన పట్ల, నేతల తీరు పట్ల విసుగుచెంది, విరక్తి కలిగి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలు, రాజకీయ లక్ష్యాలు.. అలానే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ అవిశ్రాంతంగా జనసేన పార్టీ ఉన్నతికి శ్రమిస్తున్న తీరు.. బడుగు బలహీన వర్గాలకు చేయూతనందిస్తున్న పలు సేవా కార్యక్రమాలు, పేదల పక్షాన పోరాడుతున్న తీరు, వైసిపి అరాచక, అవినీతి, అసమర్థతను ఎండగడుతున్న తీరుకు ఆకర్షితులై.. బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోవు ఎన్నికల్లో వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ నిర్మించడానికి, జనసేన- టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ సమైక్యంగా, సంఘటతంగా శ్రమించాలని ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ గారు పిలుపునిచ్చారు. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన వారిలో.. కానవరం గ్రామ వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యర్రంశెట్టి శ్రీరామకృష్ణ, సంగీత మూర్తి, బొర్రా సీతారామ్, యర్రంశెట్టి సత్తిబాబు, పిల్లా శ్రీను, బొర్రా శ్రీను, బద్దిరెడ్డి మణికంఠ, బొర్రా శివ, నాగారాపు భాస్కరరావు, సంగీత సర్రయ్య, సంగీత శ్రీను, బలాని వెంకన్న, తిరగరెడ్డి వెంకన్నబాబు, బుద్దాల వెంకటరమణ, సంగిశెట్టి పైడిరాజు, సత్యం నానీ, మొదలగు వైసిపి నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.