కళ్ళున్నా కబోదులుగా మారిన వైసిపి పాలకులు: చొప్పా చంద్ర శేఖర్

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుంతల మయమైన రోడ్లపై జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు చొప్పా చంద్ర శేఖర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూడా రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, 20 అడుగులకు ఒక గుంతతో రోడ్లు గుంతలమైన కూడా ఈ వైసీపీ పాలకులు చెప్పే 90% హామీల కథ దేవుడికి ఎరుక కానీ ప్రజలు రోడ్లపై వెళ్లేటప్పుడు 90% ప్రమాదాలు ఈ గుంతల రోడ్లతోనే జరుగుతున్నాయి. ఈ గుంతల రోడ్లలో తిరిగే ప్రజలకు 90% నడుము నొప్పులు, కళ్ళల్లోకి పడే దమ్ము ధూళితో 90% అనారోగ్యం పాలవుతున్నారు. ఈ గుంతల రహదారులపై ప్రమాదాలతో వాహనదారులు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైసీపీ పాలకులు గడపగడపకు తిరిగేటప్పుడు ఈ గుంతల రోడ్లు వాళ్ళుకు కనపడాలేదా అని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకొనుటకు మూడు సెంట్లు స్థలం కొనాలన్న రహదారి బావుందా లేదా అని చూస్తారు. అలాంటిది ఈ కళ్ళు ఉన్న కబోదులకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళుటకు రోడ్లు బాగున్నాయా లేదా కనిపించడం లేదా. ఈ గుంతలమయమైన రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం ఈ వైసీపీ పాలకులకు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. కనీస మౌలిక సౌకర్యాలైన రహదారులు కూడా కల్పించలేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని ఆలోచనలో పడినారు. ఇటువంటి పాలకులా మరీ మనకు కావలసినది. ఇటువంటి పాలన మనకు అవసరం లేదని కేవలం జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుతుందని ప్రజలంతా భావిస్తున్నారు. ఆదివారం బుక్కరాయసముద్రం మండలంలోని రేకుల కుంట గ్రామంలో గల గుంతల రోడ్డు పై నిరసన తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, సంయుక్త కార్యదర్శి, జయమ్మ, మండల అద్యక్షులు ఎర్రిస్వామి, రామకృష్ణ, ఓబిలేసు మరియు నాయకులు బాస్కర్, పెద్దిరాజు, చరణ్, కుళ్ళాయప్ప, విశ్వన, శ్రీమతి శశికళ, తాహీర్, సాయి, మదు తదితరులు పాల్గొన్నారు.