వైయస్సార్ కాపు నేస్తం వైయస్సార్ కాపు మాయా నేస్తం

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం వైయస్సార్ కాపు నేస్తం వైయస్సార్ కాపు మాయా నేస్తం వైయస్సార్ కాపు డ్రామా నేస్తం… ప్రభుత్వ అధికారిక సభలో మాయమాటలతో అంకెల గారడీ, కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వకుండా కాపులకు శాశ్వత ఉపాధి కల్పించకుండా… అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలను కాపులకు ఇస్తూ…కాపు కులాన్ని ఉద్ధరించేశానంటూ… “మాయల ఫకీర్ ” సిబీఇ దత్తపుత్రుడు మాయ మాటలు. కాపు నేస్తం సభలో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణలో ఒక రెడ్ల సభలో రెడ్లని తప్పుగా మాట్లాడారని రాష్ట్ర మంత్రి అని చూడకుండా తరిమి తరిమి కొట్టారు. కాపు సభలో పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే కాపు కుల సంఘ నాయకులారా, కాపు కుల సభ్యులారా మీరందరూ ఎందుకు మౌనంగా భరిస్తున్నారు? భయమా…. మీకు సిగ్గు, పౌరుషం, రోషం, చీము, నెత్తురు లేవా? అని మా మిత్రుడు అడుగుతున్నాడు? పవన్ కళ్యాణ్ ఒక కులానికి, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని, తన సొంత నిధులను వెచ్చించి విపత్తుల సమయంలో కావచ్చు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు తన వంతు సహాయంగా ఆదుకుంటున్నాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని మన అందరి భవిష్యత్తు కోసం తపన పడుతున్న అభినవ గాంధీ. కాపు నేస్తం ద్వారా సంవత్సరానికి 15000/- డబ్బులు ఇస్తున్నారు.. నెలకు 1250 /- అవుతుంది రోజుకు 41 రూపాయల 60 పైసలు అవుతుంది. నిత్యావసర సరుకులు రేట్లు అన్ని పెరిగిపోయినాయి, మద్యం, ఇసుక, సిమెంట్, స్టీల్, పెట్రోలు, డీజల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు, గృహ పన్ను చెత్త పన్ను ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రతి చోట రేట్లు పెంచి పన్నులు వేశారు. 15000/- డబ్బుని మీరు దేనికి ఖర్చు పెట్టుకుంటారో పెట్టుకోండి?… ఎక్కడ పెట్టుకుంటారో మీరే తేల్చుకోండి? పండగ చేసుకోండి…. కాపులంతా అభివృద్ధి చెందిపోండి? మన జగనన్న 15000/- ఇస్తూ కాపు కులాన్ని ఉద్ధరించేసినాడు? కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున ఐదేండ్లకు 10,000 కోట్లు ఇస్తాను అని ఎన్నికల ముందు చెప్పారు. అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలు కాపులకు ఇస్తున్నారు….. ఇప్పటికే కాపు కులస్తులందరికీ 32వేల కోట్లు ఇచ్చారు అంట కదా? కాపులారా ఇది నిజమేనా? అంటే ఇంక కాపు కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వడు…. అంతేగా అనండి అంటూ అనుపాలెం జనసేన గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మినారాయణ అన్నారు.