*గంజాయి వనాలని పెంచింది వైసీపీ పార్టీ
*సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండల జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో యువత జీవితం సర్వనాశనమైందని పేర్కొన్నారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలకు యువతను బానిసలుగా మార్చిన పార్టీ వైసీపీనే అని విమర్శించారు. వాలంటరీ ఉద్యోగాల పేరిట యువతను ₹5000 భత్యంతో నడిపించి, వారి జీవితాలను పనికిరాని దిశగా నెట్టిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఆడబిడ్డలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనకు తలచిన తాలూకులు అని గుర్తు చేశారు. హత్య రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి పాలన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఉద్యోగాలపై ఒక్క క్యాలెండర్ కూడా విడుదల చేయకపోవడం వైసీపీ యువతపై చేసిన అత్యంత దారుణమైన విరోధ చర్యగా అభివర్ణించారు. యువత గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. వైసీపీ అవినీతినే కారణంగా ఏ ఒక్క కొత్త కంపెనీ రాష్ట్రంలోకి రాలేదని, అభివృద్ధి అనే మాట ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు, మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, చల్లా చెంచయ్య, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment