పార్టీ మ‌నుగ‌డ కోస‌మే వైసీపీ యువ‌త‌ పోరు: పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, జ‌నాద‌ర‌ణ క‌రువై ఉనికి వైసీపీ చేస్తున్న డ్రామాల‌ను ప్ర‌జ‌లు తిప్పికొడుతున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. ఆదివారం ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’ పేరుతో వైసీపీ ధర్నాల‌కు పిలుపునిచ్చింద‌ని, గ‌తంలో ప్ర‌జాద‌ర‌ణ లేని కార‌ణంగా ఫీజు పోరు పేరుతో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డ్డాయ‌ని గుర్తు చేశారు. దాన్ని పేరు మార్చి తిరిగి యువ‌త పోరుతో కొత్త వీధినాట‌కాల‌కు తెర‌తీస్తున్నార‌ని విమ‌ర్శించారు. వైసీపీ సీనియర్లు ఒక్కొక్కరు వైసీపీకి గుడ్‌బై చెబుతుంటే, వలసలను నివారించడంలో విఫ‌ల‌మైన జగన్ పార్టీ మ‌నుగ‌డ కోసం కూట‌మి ప్ర‌భుత్వంపై ఆందోళ‌న‌లు చేప‌డుతున్నార‌ని బాలాజి వెల్ల‌డించారు. గ‌త 5 ఏళ్లకు రూ.4,271 కోట్లు ఫీజు బ‌కాయిలు పెట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌, విద్యార్ధుల కోసం పోరాటం చేస్తానని చెప్ప‌టం హాస్య‌స్పదంగా వుంద‌ని. విద్యార్ధులు, యువ‌త‌ జీవితాల‌తో ఆడుకోవ‌టానికి యువ‌త పోరుతో అంటూ మ‌రో కొత్త డ్రామాకు తెర‌తీస్తున్నార‌ని ఎద్దేవా చేశారు..వైసీపీ నాయ‌కులు ఉనికి కోసం చేసే దొంగ పోరుల‌ను యువ‌కులు, విద్యార్ధులు న‌మ్మ‌టానికి సిద్దంగా లేర‌ని తెలిపారు. వైసీపీ పాల‌న‌లో ఎంతో మంది విద్యార్ధులను ఫీజు విష‌యంలో కళాశాల యాజమన్యాలు వేధించాయని, కొన్ని చోట్ల హాల్ టిక్కెట్లు నిలిపివేసి, పరీక్షలు రాయ‌కుండా విద్యార్దులను ఇబ్బందులకు గురిచేశార‌ని గుర్తు చేశారు. ఏడు ల‌క్ష‌ల మంది విద్యార్ధుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం విద్యకు దూరం చేసింద‌ని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశారని బాలాజి గుర్తు చేశారు.ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో లక్షల మంది నిరుద్యోగులు జగన్ చేతిలో వంచ‌న‌కు గుర‌య్యార‌ని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ, యువకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్ల‌డించారు. రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింద‌ని వివ‌రించారు. ఇందులో భాగంగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నార‌ని, 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేయ‌నున్నార‌ని చెప్పారు. విద్యార్దులు, యువ‌త‌ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు వైసీపీకి లేదని, ప్ర‌చార ఆర్భాటం కోసం, పార్టీ మ‌నుగ‌డ కోసం చేసే యువ‌త‌ పోరులో విద్యార్ధులు, యువ‌త‌ మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని వెల్ల‌డించారు.

Share this content:

Post Comment