తిరుపతిలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

తిరుపతి, యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి భునపల్లి మునస్వామి అన్నారు. 2019 ఎన్నికల టైములో వైసీపీప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలండర్ విడుదల చేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా జాబ్ కేలండర్ విడుదల చెయ్యకపోవడం చాలా బాధాకరం, దీని వలన ఏపీలో యువత ఉద్యోగ వలసలు పెరిగిపోయాయి, కావున సామాన్య యువతి యువకులు యువశక్తి సభలో మీ యొక్క సమస్యలను మీ ఆలోచనలను తెలియజేసి యొక్క ఉజ్వల భవిష్యత్ కు ఈ సభకు వేలాదిగ పాల్గొని విజయవంతం చేయవల్సిందిగా కోరుతూ.. మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు 08069932222, ఈ–మెయిల్ vrwithjspk@janasenaparty.org కు యువతీ యువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి వివరాలను పంపి జనసేనాని సమక్షంలో మీ గళాన్ని వినిపించండి. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉపాధ్యక్షలు కొండా రాజమోహన్, రాజేష్ ఆచారి ప్రధాన కార్యదర్శి కిరణ్ రాయల్, హేమంత్ రాయల్ కార్యదర్శి, నునే దిలీప్ రాయల్, పవన్, పురుషోత్తమ్, బాలచంద్ర, వెంకటేష్ లు పాల్గొన్నారు.