విశాఖ రూరల్ నియోజకవర్గాల్లో యువశక్తి సన్నాహక సమావేశాలు

చోడవరం, యూత్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పెదపూడి విజయ్ కుమార్ అధ్వర్యంలో విశాఖ రూరల్ నియోజకవర్గాల్లో యువశక్తి సన్నాహక సమావేశాలలో భాగంగా డే 1 – చోడవరం నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువశక్తి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ఇంఛార్జి పి.విఎస్.ఎన్ రాజుకి కమిటీ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి అన్నారు.