యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: గాదె

గుంటూరు: వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుదలకు భవిషత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలో నియోజవర్గ నాయకులతో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమావేశమై చర్చించడం జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని బలంగా జనాల్లోకి తీసుకు వెళ్లాలని నాయకులకు తెలియజేసారు. జనవరి 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుందని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది.ఈ యువశక్తి కార్యక్రమం మనం విజయవంతం చేయాలని ఈ వినుకొండ నియోజకవర్గంలో నుంచి ఎక్కువ సంఖ్యలో యువత ఈ కార్యక్రమానికి తరలిరావాలని తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో మన పార్టీ ఎదుగుదలకు నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు సమిష్టిగా కృషి చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, నిస్శంకర శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.