భామిని మండలంలో యువశక్తి కార్యక్రమ విస్తృత ప్రచారం

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలంలో మంగళవారం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, రణస్థలంలో జనవరి 12వ తారీఖున యువశక్తి భారీ బహిరంగ సభ కార్యక్రమ ప్రచారం నిమిత్తం జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గం ప్రచార కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు, పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా యువశక్తి కరపత్రం, పాసులు, జండాలను అందించడం జరిగింది. తదనంతరం పాలకొండ నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలో పర్యటిస్తుండగా గ్రామ ప్రజలు వంశీధార నది సమస్యను తీసుకురావడం జరిగినది. వెంటనే ప్రాజెక్టును సందర్శించి ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టి కి తీసుకెళ్తానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.