జడ్పీటీసీ ఉప ఎన్నికల సన్నాహక భేటీ

*సుంకర శ్రీనివాస్ నేతృత్వంలో వ్యూహాత్మక చర్చలు

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ హాజరై, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, “ఉప ఎన్నికల విషయంలో పార్టీ బలాన్ని పెంచే దిశగా కార్యాచరణ అవసరం. ప్రతి ఓటు జనసేన భవిష్యత్తు నిర్ణయించేదిగా మారబోతుంది. పోటీ విషయంలో పార్టీ అధిష్ఠానం, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజా స్పందనతోనే నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. ప్రజల్లో ఉన్న మద్దతును మరింత బలోపేతం చేయాలని, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని సమన్వయపరచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక మండల నాయకులు, యువజన నాయకులు, నియోజకవర్గాల ప్రతినిధులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు.

Share this content:

Post Comment