చేగొండి హరిరామ జోగయ్య యోగక్షేమాల గురించి వాకబు చేసిన పవన్ కళ్యాణ్

అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గారి యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వాకబు చేశారు. ఇటీవల హరిరామ జోగయ్య గారు ఇంట్లో పడిపోయారు అనే విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. జనసేన పార్టీ పి.ఏ.సి. సభ్యులు, హరిరామ జోగయ్య కుమారుడైన చేగొండి సూర్యప్రకాశ్ ను పిలిపించుకొని మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హరిరామ జోగయ్య గారిని కలుస్తానని చెప్పారు. హరిరామజోగయ్య గారంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవభావం. ఎప్పటికప్పుడు ఆయన యోగక్షేమాలను తెలుసుకొంటూ ఉంటారు. గతంలో హైదరాబాద్ లో చికిత్స పొందిన సమయంలోనూ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు.